కనిపెట్టింది ఎవరు
టీచర్ : గోపి...ఇలా వచ్చి మ్యాప్‌లో అమెరికా ఎక్కడుందో చూపించు...
గోపి : ఇదిగో ఇక్కడుంది టీచర్...
టీచర్ : వెరీ గుడ్ వెళ్లి కూర్చో....
టీచర్ : చూడండి పిల్లలూ అమెరికా కనిపెట్టింది ఎవరు?
పిల్లలు : గోపీ టీచర్....
వంద శాతం
కొడుకు : డాడీ...ఇవాళ నాకు వంద మార్కులు వచ్చాయి...
తండ్రి : వెరీ గుడ్..మై చైల్డ్...ఎప్పుడూ ఇలానే మార్కులు తెచ్చుకోవాలి. ఇంతకీ
ఏ సబ్జెక్టులో వచ్చాయి వంద మార్కులు....
కొడుకు : అన్ని సబ్జెక్టులు కలిపి వంద మార్కులు వచ్చాయి డాడీ...
ఈజిప్ట్ మమ్మీ
కొడుకు : డాడీ...నువ్వు ఎప్పుడైనా ఈజిప్ట్ వెళ్లావా?
తండ్రి : లేదు బాబూ ఏం అలా అడిగావు...
కొడుకు : మరి...మన మమ్మీని ఎక్కడినుంచి తెచ్చావు...
దగ్గరి బంధువులు
చంటి : ఒరేయ్ బంటీ నా పెళ్లికి నువ్వు ప్రెజెంట్ చేసిన బైనాక్యులర్ చాలా బాగుందిరా..
ఇంతకీ నాకు ఎందుకు బహూకరించావు దాన్ని...
బంటి : ఏం లేదురా...పెళ్లికొచ్చిన దూరపు బంధువులను కాస్త దగ్గరగా చూస్తావని బైనాక్యులర్ కొన్నాను... అంతే...
నరకం టూ నరకం
ముషార్రఫ్ : యమ ధర్మరాజా ఒక్కసారి మా పాకిస్తాన్‌కు ఫోన్ చేసుకోవచ్చా...డబ్బులు ఎంత కట్టాల్సి వుంటుంది.
యముడు : మరేం ఫర్వాలేదు...నరకం టూ నరకం ఫ్రీ మొబైల్ సర్వీస్ ఫెసిలిటీ వుంది మీరు ఎంతసేపైనా మాట్లాడొచ్చు....
విరుగుడు
పేషెంట్ : డాక్టర్...నేను చాలా కాలం జీవించాలనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాను.
ఈ వ్యాధికి విరుగుడు లేదా...
డాక్టర్ : మీరు ఓ పని చేయండి. అర్జెంటుగా పెళ్లి చేసుకోండి...
పేషెంట్ : పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చా?
డాక్టర్ : అదేం లేదు...పెళ్లి చేసుకుంటే మీ కెప్పుడూ ఎక్కువ కాలం జీవించాలనే ఆలోచనే రాదు.
రిజిస్టర్....మ్యారేజ్
మూర్తి : రాధా నన్ను ఎందుకు మోసం చేశావు...
రాధ : లేదే నేనెక్కడ మోసం చేశాను...
మూర్తి : నిన్న నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పావని రోజంతా పోస్టాఫీస్ దగ్గర నీ కోసం వెయిట్ చేశాను.
రాధ : పోస్టాఫీస్ వద్ద ఎందుకు వెయిట్ చేశావు...
మూర్తి : మరి రిజిస్టర్ పోస్ట్ అక్కడే కదా చేసేది...మ్యారేజెస్ కూడా అక్కడే చేస్తారని...
చెవుడంటే ఇదే...
లెక్చరర్ : బొద్దింక మీద నిన్న ల్యాబ్‌లో చేసిన ప్రయోగం గురించి చెప్పు...
వెంగళప్ప : బొద్దింక ఆరు కాళ్లు తీసేసినా కూడా ఆగమంటే ఆగకుండా అది
పాకుతునే ఉంది సార్...దీనిని బట్టి నాకు ఒక విషయం అర్థమయింది.
బొద్దింక ఆరు కాళ్లు తీసేస్తే దాని చెవులు వినపడకుండా పోతాయి.
సై్మల్ ప్లీజ్
నమస్తేసార్ నేను గుర్తున్నానా అదేనండీ ఆ మధ్య ఆదివారం కలిచాము. చూడు నేనే గుర్తోచ్చిందా? వచ్చే ఉంటుందిలేండి. ఇక అసలు విషయానికొస్తున్నాను. మొన్న నేనో పెళ్లి చూపులకు వెళ్లాను అక్కడి జరిగిన కథ ఎంటంటే..
ఒరేయ్ అల్లుడు నేను చెప్పేది ‘నిజం’. పిల్ల ముందునుండి చూస్తే అచ్చం ‘రంబ’లా, వెనకనుండి చూస్తే‘ఇలియానా’లా, సైడ్‌నుండి చూస్తే ‘జెనిలియా’లా ఉంటుందిరా. మా ‘మామగారు’ చెబుతుంటే నేను ‘రోజ్ రోజ్ రోజా పువ్వా పువ్వా, రోజురోజు పూస్తు ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా?’ అంటూ ఓ డ్రీమ్ వేసుకున్న. ఇంతలో మా ‘అమ్మ’ కల్పించుకుని ఒరేయ్ నిను కూడా చూశానురా చీరకడితే‘జయసుధ’లా, లంగా,పరికిణి వేస్తే ‘శ్రీదేవి’లా చుడీదార్ వేస్తే ‘జయప్రద’లా ఉంటుందిరా అంటూ తనకు తెలిసిన పాతతరం నాయికల పేర్లు చెప్పింది. నాకయితే మనసు మనసులా లేదు. ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని చూద్దామా అని‘నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో’ అని పాడు కోవాలనిపించింది.మొత్తం మీద రెండు రోజులు గడిచింది.‘ఇపుడో అపుడో ఎపుడో కలగన్నానే చెలీ’అనుకుంటూ మొత్తంమీద అమ్మాయి వాళ్లింటికి వెళ్లాము.
అమ్మాయి పేరు ఏంటని మెళ్లగా ఆరా తీశాను.‘సుందరి’ అని చెప్పారు. ఏమీ నా భాగ్యము అనుకున్నాను. సుందరి అంటే అచ్చం అప్సరసలా ఉంటుందని తెగ సిగ్గుపడ్డాను.‘సుందరి నీవంటి దివ్యస్వరూపంబు ఎందెందు వెదికిన లేదు కదా? ’ అనుకుంటు అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. మొదట వాళ్ల చెల్లెలు అందరికీ టీలు తెచ్చింది. చూడగానే టీ మీదే విరక్తిపుట్టింది. చిన్న సైజు గున్న ఏనుగులా అనిపించింది. కళ్లు తిరిగినట్లు అనిపించింది. పది నిమిషాల తరువాత భూకంపం వచ్చినట్లు ఇళ్లు కదులుతుంటే తలెత్తి చూశా. నా ఎదురుగా ఒక పెద్ద బండరాయి ఉన్నట్లుగా అనిపించింది. అమ్మ ఈ బండరాయినేనా శ్రీదేవి, ఇలీయాన అన్నది అన్నాను. అవునునాయన అంది మా అమ్మ. అంతే నా కళ్లముందు చీకట్లు పరుచుకున్నాయి. కళ్లు తెరిసి చూస్తే గాంధీ అసుపత్రిలో ఉన్నాను. ఇదండీ సార్ నా పెళ్లి చూపుల కథ. ఇక జన్మలో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను.
ఇట్లు మీ ఏడు కొండలు
కూనిరాగాలు
రాలిపోయే కుసుమం సువాసననిస్తుంది!
కాలిపోతూ క్రొవ్వొత్తి వెలుగుల నిస్తుంది!
పొరుు్యలో కట్టెలు బూడిదపాలు!
కయ్యలో కాళ్ళు బురదపాలు!
వ్యవస్థే అవస్థల పాలవుతుంది!
బ్రతుేక సమస్యల వశమవుతుంది!
గోరంతలు కొండంతలు అనిపిస్తే లోపం!
బాలింతను కామంతో వీక్షిస్తే పాపం!
మట్టి మడతలో పరిమళాన్ని ఆస్వాదించాలి!
మంచిమనసుతో పసిప్రాయాన్ని ఆశీర్వదించాలి!
శిరస్సు సిగ్గుతోకాదు గౌరవంతో వంగాలి!
నమస్సు భయంతో కాదు భక్తితో చేయాలి!
Type rest of the Post here
No comments:
Post a Comment